RTC Conductor Recruitment 2026: తెలంగాణలో 1,500 కండక్టర్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపికకు అవకాశం!

RTCలో 1,500 కండక్టర్ ఉద్యోగాలు.. 10వ తరగతి మార్కులతోనే ఎంపికకు అవకాశం.. త్వరలో నోటిఫికేషన్! | RTC Conductor Recruitment 2026

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోలలో ఔట్‌సోర్సింగ్ విధానంలో తాత్కాలిక కండక్టర్ల ఎంపిక కొనసాగుతోంది. ఈ ఎంపిక పూర్తిగా నిబంధనల ప్రకారమే జరుగుతోందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

పదో తరగతి మార్కులకు ప్రాధాన్యం

అభ్యర్థుల ఎంపికలో పదో తరగతి మార్కుల మెమో, ఆధార్ కార్డు, నిర్దేశిత ఎత్తు ప్రమాణాలను పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక కాంట్రాక్ట్ ఏజెన్సీలు సమర్పించిన జాబితాల ఆధారంగానే ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు.

1,500 పోస్టుల భర్తీకి సిద్ధం

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెగ్యులర్ కండక్టర్ పోస్టుల భర్తీ జరగలేదు. ఇదే సమయంలో ప్రతి ఏడాది ఉద్యోగులు పదవీ విరమణ పొందుతుండటంతో ఖాళీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,500 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

గ్రేడింగ్ విధానంపై స్పష్టత కోసం ఎదురుచూపు

గతంలో పదో తరగతిలో మార్కుల విధానం ఉండగా, తరువాత గ్రేడింగ్ విధానం అమలులోకి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ మార్కుల విధానం అమల్లో ఉండటంతో, గ్రేడింగ్‌ను మార్కుల శాతంగా ఎలా పరిగణించాలనే అంశంపై ఆర్టీసీ అధికారులు ఎస్సెస్సీ బోర్డు నుంచి స్పష్టత కోరినట్లు సమాచారం.

అధికారిక నోటిఫికేషన్ ఎప్పుడు?

గ్రేడింగ్ అంశంపై స్పష్టత వచ్చిన తర్వాత అధికారిక రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. నోటిఫికేషన్‌లో అర్హతలు, దరఖాస్తు తేదీలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

ముఖ్యాంశాలు

  • మొత్తం పోస్టులు: 1,500
  • ఉద్యోగం: TGSRTC Conductor
  • అర్హత: 10వ తరగతి
  • ఎంపిక: మార్కులు + పత్రాల పరిశీలన (ప్రస్తుత సమాచారం ప్రకారం)
  • నోటిఫికేషన్: త్వరలో విడుదలయ్యే అవకాశం

Leave a Comment

Join WhatsApp WhatsApp